![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -445 లో.....కావ్య గార్డెన్ లోని మొక్కలకి నీళ్లు పడుతుంటే రాజ్ వచ్చి కావ్యని చూస్తుంటాడు. సాంగ్స్ పెట్టుకొని వింటూ కావ్య నడుం వంక చూస్తుంటాడు. అప్పుడే రాజ్ ని కావ్య చూసి.. ఏం చేస్తున్నారు, మీరు నా నడుం చూసారని అడుగుతుంది. మీరేదో జెంటిల్ మెన్ అనుకున్నా అని కావ్య వెళ్ళిపోతుంది. సైట్ కొడుతున్న విషయం ముందు దీనికి తెలియాలి ఎలా అని అనుకుంటాడు రాజ్. అమ్మాయిలకి సైట్ కొట్టడం రాదు ఇక పెళ్ళానికి ఎలా సైట్ కొట్టడం వస్తది. పెళ్ళానికి సైట్ కొట్టడం ఎలా అనే బుక్ ఉంటే బాగుండు అని రాజ్ అనుకుంటాడు.
మరొకవైపు అప్పు పోలీస్ ట్రెయినింగ్ కి వెళ్తుంటే కనకం వద్దని ఆపుతుంది. ఇంత జరిగాక కూడా నువ్వు బయటకు వెళ్తే బాగుండదని కనకం అంటుంది. నేను వెళ్తాను.. పోలీస్ అనేది నా డ్రీమ్ అని అప్పు అంటుంది. ఆ తర్వాత బంటుని తీసుకొని అప్పు వెళ్తుంది. అసలు ఏం జరుగుతుందని ఇందిరాదేవి రాజ్ ని అడుగుతుంది. ఏం జరుగుతుందని రాజ్ మళ్ళీ అంటాడు. ఇందాక నువ్వు గార్డెన్ లో వేసిన చేష్టలన్ని చూసేసానని ఇందిరాదేవి అనగానే రాజ్ తడబడతాడు. ఇంకా ఎన్నాళ్ళు దొబ్చులాడుతారు.. ఎప్పుడో ఒకసారి తన మీద ప్రేమని బయపెట్టాలి కదా నిన్నే నమ్ముకొని వచ్చిన కావ్యకి నీ ప్రేమ ఇవ్వాలి కదా అని ఇందిరాదేవి అడుగుతుంది. ఇదే ప్రశ్న చాలాసార్లు నన్ను నేను అద్దంలో చూసుకున్న ప్రతిసారీ అడుగుతున్న కానీ తన మీద నాకు ప్రేమ ఉండడం ఏంటని సర్ది చెప్పుకున్నా కానీ నాకే తెలియకుండా కావ్య ప్రేమలో పడేసిందని రాజ్ అంటాడు. అయితే ఈ విషయం కావ్యకి చెప్పమని ఇందిరాదేవి అంటుంది. నాకు చెప్పాలని ఉంది కానీ ఇప్పుడు కుటుంబం సంతోషంగా ఉండడానికి తనే కారణం కాబట్టి అందుకే తనని భార్యగా స్వీకరిస్తున్నానేమోనని, నన్ను స్వార్థపరుడిని అనుకుంటదేమోనని భయమని రాజ్ అంటాడు. అదేం లేదు.. ఇప్పుడు వెళ్లి చెప్పు అని ఇందిరాదేవి అనగానే.. ఇప్పుడు వద్దు దానికి ఒక టైమ్ కావాలి.. ప్రశాంతంగా ఉండాలని రాజ్ అంటాడు. ఆ టైమ్ ఏదో రాత్రికి సెట్ చేస్తానని ఇందిరాదేవి అనుకుంటుంది. మరొకవైపు అప్పు వెళ్తుంటే అనామిక అడ్డుపడి.. జరిగింది మొత్తం నా ప్లానే.. మీడియా రావడం.. ఇదంతా నేను చెప్పినట్టు జరిగింది. ఇంకొకసారి నా భర్తతో తిరిగితే మర్యాదగా ఉండదని అనామిక అనగానే.. అప్పు తన స్టైల్ లో అనామికకి వార్నింగ్ ఇస్తుంది. వీళ్ళిద్దరు కల్వకుండా చేసాను.. ఇక ఆస్తి సొంతం చేసుకోవాలని అనామిక అనుకుంటుంది.
.webp)
మరొకవైపు ఇందిరాదేవి స్వప్న, ప్రకాష్, అపర్ణలని పిలిచి.. రాజ్, కావ్యలకి ఈ రోజు శోభనం ఏర్పాట్లు చెయ్యాలనుకుంటున్నా.. ఈ విషయం వాళ్ళకి తెలియకూడదని ఇందిరాదేవి అంటుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు స్వప్న ప్రకాష్ లని చూసుకోమని చెప్తుంది. దానికి అపర్ణ కూడా సరే అంటుంది. తరువాయి భాగంలో రాజ్ , కావ్య గదిలోకి వెళ్తారు. గది డెకరేషన్ తో ఉండడం చూసి ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తారు. కావ్యకి తన మనసులో మాట చెప్పాలని రాజ్ ట్రై చేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |